
నల్గొండ అర్బన్, వెలుగు: పదోన్నతి పొందిన ఎస్‌ఐలకు బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 11 మంది ఏఎస్‌ఐలకు, ఎస్ఐలుగా పదోన్నతి పొందగా.. ఎస్పీ వారికి స్టార్‌లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమవుతూ బాధ్యతతో పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్ సిబ్బందిపాల్గొన్నారు.